Entha Manchivaadavuraa Review In Telugu
కథ: చిన్న తనంలోనే బంధాలు బంధుత్వాల విలువ గురించి తెలుసుకున్న కళ్యాణ్ రామ్, తన చిన్ననాటి స్నేహితురాలైన మెహరీన్ తో కలిసి షార్ట్ మూవీస్ చేస్తుంటారు. స్నేహితులకి కళ్యాణ్ రామ్ ఒక స్నేహితుడిగా తెలుసు, అయితే, ఊర్లో అందరికి మాత్రం మనవడిగా, కొడుకుగా, తమ్ముడిగా ఇలా బంధాలతో అనుబంధాలతో వారితో కలిసిమెలిసి ఉంటాడు. వివిధ రకాల పేర్లతో అందరికి చేరువైన కళ్యాణ్ రామ్, ఆచార్య అనే పేరుతో ఓ ఇంటికి వెళ్ళాక అక్కడ అనేక సమస్యలు ఎదురౌతాయి. ఎదురైన సమస్యలను కళ్యాణ్ రామ్ ఎలా పరిష్కరించారు? చిన్ననాటి స్నేహితురాలు మెహరీన్ తో జీవితం పంచుకున్నాడా లేదా అన్నది మిగతా కథ. విశ్లేషణ: బంధాలు, అనుబంధాలు, వాటి చుట్టూ ఉండే ఎమోషన్ చుట్టూనే సినిమా నడుస్తుంది. అన్నింటికంటే సున్నితమైన అంశం ఏదైనా ఉందా అంటే అది బంధం అనుబంధం అని చెప్పాలి. వీటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తే... వారి మధ్య ఎమోషన్ బాండ్ అంత బలంగా ఉంటుంది. కళ్యాణ్ రామ్ ఒక్కో పేరుతో ఒక్కోచోట కనిపిస్తూ ఉంటారు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మసులుకుంటూ ఉంటాడు. ఏదొక సమయంలో, ఏదొక పాత్రతో ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు అనడంలో సందేహం అవసరం లేదు. ప్రేక్షకుడిని సి